నిజాంపేట, నేటి దాత్రి, ఏప్రిల్ 4
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో లాభార్తి సంపర్క్ యుజన కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వాడల్లో తిరుగుతూ ఫిర్ ఏక్ బార్ మోడీ జీ సర్కార్ అనే నినాదంతో ప్రతి గడపను సందర్శించి బిజెపికి ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిమ్మనమైన శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బిజెపి సీనియర్ నాయకులు ఆకుల రమేష్, బాజా అంజయ్య, ఆకుల శీను, నాలం నాగరాజ్ గౌడ్, కిషన్ నాయక్, ఆకుల రాములు, బాజలింగం బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు