ఎల్. ఓ. సి అందజేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి

గొల్లపల్లి నేటి ధాత్రి:

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామానికి చెందిన గోలి బాలకిషన్ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నాడు. వైద్య ఖర్చులకోసం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి విషయం తెలుపగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఒక లక్ష 65 వేల ఎల్ ఓ సి ని బాలకిషన్ తండ్రి గోలి రాజేందర్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరసాని రాజ్యలక్ష్మి తిరుపతిరెడ్డి, దర్ర మహేష్, వెంకటేష్, సుద్దాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version