కెవిపిఎస్ రాష్ట్ర సాహయ కార్యదర్శి మంద సంపత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరూరి కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
కెవిపిఎస్ జిల్లా సామాజిక చైతన్య రాజకీయ శిక్షణ తరగతులలో జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ మహేందర్, ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ ఉపాధ్యక్షులు ఆరూరి కుమార్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ 10 ఏళ్ల పాలన దళితుల పాలిట శాపంగా మారిందన్నారు దళితులపైన 300 రెట్లు దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు రాజ్యాంగం రద్దుకు అనేక రకాల కుట్రలు చేసిందన్నారు దేశ ప్రజలు ఐక్యంగా తిప్పి కొట్టడంతో తోక ముడిచిందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతుందని తద్వారా రిజర్వేషన్లను తుంగలో తొక్కి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు కుల వివక్ష అంటరానితనాన్ని కొనసాగించడానికి బిజెపి సైద్ధాంతిక కృషి చేస్తుందన్నారు అన్ని రకాల అసమానతలను అంతం చేయడానికి కేవీపీఎస్ నిరంతరం శ్రమిస్తుందన్నారు
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందన్నారు దళితులు మహిళలకు ఏమాత్రం రక్షణ లేని పరిస్థితులు వచ్చినాయి
బిజెపిని బలపరచడం అంటే మతోన్మాద శక్తులను మానవ మారణ హోమాన్ని బలపరచడమేనని ఆయన చెప్పారు మతోన్మాదుల వల్ల దేశ సమైక్యతకు భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రిజర్వేషన్లు కాపాడుకోవాలి కెవిపిఎస్ చైతన్య తరగతులు దోహదం చేస్తాయన్నారు
ఈ కార్యక్రమంలో శేఖర్ రమేష్ మహేందర్ శ్రీధర్ సమ్మయ్య రామచంద్రు రాజయ్య తదితరులు పాల్గొన్నారు