కష్టపడిన వారిని గుర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు ధన్యవాదములు
మేడ్చల్ జిల్లా
తెలంగాణ రాష్ట్ర రెండవ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నగారిగారి ప్రీతమ్ గారిని గుండ్లపోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు యువనాయకులు కుండ భానుచందర్ కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు భానుచందర్ తెలిపారు.
ఈ సందర్భంగా కుండ భానుచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడే వారిని గుర్తించి వారికి ఉన్నతమైన పదవులు ఇస్తూ, యువతలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన అన్నారు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, దళితులకు ఇక్కడ అన్యాయం జరిగిన, ముందుండి వారికి న్యాయం జరిగేంత వరకు కొట్లాడిన యువ నాయకుడు మన ప్రీతమ్ అన్న అని కుండ భానుచందర్ కొనియాడారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నేడు పదవి బాధ్యతలు చేపట్టిన ప్రీతం అన్న అర్హులైన దళితులందరికీ కార్పొరేషన్ నిధులు ఇవ్వాలని ఆయన తెలిపారు, గత ప్రభుత్వంలో కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకే ఇచ్చారని కుండ బానుచందర్ మండిపడ్డారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ తప్పకుండా రుణాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.