నేటిధాత్రి, వరంగల్ తూర్పు
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ కాశీబుగ్గ 20వ డివిజన్లో, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆదేశానుసారం, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి సూచనల మేరకు, 20వ డివిజన్ కాశీబుగ్గలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలు కాశీబుగ్గ శివాలయం ముందు స్థానిక బి.ఆర్.ఎస్ నాయకులు కేక్ కట్ చేసి, పండ్లను పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ అధ్యక్షులు ఇక్బాల్, సోమాజి నరేష్, చిర్ర అభిషేక్ (లడ్డు), మహమూద్, చిమ్మని సంతోష్, జక్కి అశోక్, కొడారి రవి, కవిత, జక్కి యుగేందర్, మంద రమేష్, కుసుమ నరేష్, కొమురయ్య, జన్ను చిన్న, వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.