భద్రాచలం నేటి దాత్రి
సామాన్య జనం తో పాటు రాజకీయ నాయకులు సైతం క్యూ కట్టడం వెనుక రహస్యం ఏమిటి!
భద్రాచలం పినపాక కొత్తగూడెం నియోజకవర్గాలలో అనేక ప్రాంతాలలో బాగా పట్టున్న వ్యక్తి డా.కృష్ణ చైతన్య స్వామి.
కరోనా కష్ట కాలం నుండి నేటి వరదలు వరకు మన్యం లో ఆపద లో ఉన్న ప్రతి గడపలో పెద్ద కొడుకులా అండగా నిలిచింది శ్రీ నృసింహ సేవా వాహిని సంస్థ ఆ సంస్థ వ్యవస్థాపకుడే డా. కృష్ణ చైతన్య స్వామి ,పల్లెల్లో ఆయన కనిపిస్తే దేవుడులా చూసే భక్తులు ఎందరో. అలానే ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని జెండాలు మోసినా చివరికి చాలా ఊళ్ళల్లో చైతన్య గురువుగారి మాటే శాసనం గురువుగారు చెపితే కనీసం ఈ మూడు నియోజక వర్గాల్లో 15 నుండి 20 వేల ఓట్లు పడతాయని చాలా మంది విశ్వాసం,
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రాజకీయ నాయకులు వారి విజయం కోరుకుంటూ గురువుగారి దగ్గర పూజలు చేపించు కుంటున్నారు.2009 నుండి నిర్విరామంగా రాజకీయ ప్రముఖులకు పూజలు చేయడం లో దిట్ట మన కృష్ణ చైతన్య స్వామి
ఈ మధ్యకాలం లో తెలంగాణ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు టికెట్ కోసం హోమం,పూజలు చేపించుకుని టికెట్ సొంతం చేసుకున్నారు
ఈసారి తెలంగాణ లో ఏ జెండా ఎగురుతుందో గురువుగారి ఆశీస్సులు ఎవరికి మెండుగా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలలో చైతన్య స్వామి కోసం క్యూ కడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగడం రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు తెచ్చే అవకాశం కూడా ఉన్నది
కృష్ణ చైతన్య స్వామి గురించి పరిశోధన చేస్తే ఎందుకు ఇంత ప్రజాదరణ ఉంది అంటే ఆయన పేదల పక్షపాతి ప్రతినిత్యం వందలాది మంది ఆయన దగ్గర కి వస్తుంటారు ఎంతో మందికి సలహా సూచనలు ఇస్తూ కరోనా సమయంలో కొన్ని లక్షల మందికి ఆహారాన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది గోదావరి వరద సమయంలో ప్రతినిత్యం కొన్ని వేల మందికి ఆహారాన్ని ఇచ్చారు కృష్ణ చైతన్య స్వామి,ఆంధ్ర ప్రాంతంలో కూనవరం విఆర్ పురం మండలాలు పూర్తిగా 17 రోజులు కాలం పాటు ఆహారాన్ని అందివ్వడంతోపాటు సుమారు 5 వేల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందించి పేదోళ్ల పెద్దకొడుకుగా ఉన్నారు ఈ చైతన్య స్వామి
ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తప్ప ప్రత్యేకంగా ఆయనకు హంగు ఆర్భాటాలు ఉండవు కానీ ప్రస్తుత ఎన్నికలలో అనేక గ్రామాలు ఆయన ఎవరికి చెపితే వాళ్ళవైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి
భద్రాచలం వచ్చే యాత్రికులకు నిత్యాన్నదానం, గో సేవ,లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ,సామజిక భాద్యతను మోస్తున్న గిరిజన ప్రాంతాల ముద్దుబిడ్డ ఈ చైతన్య స్వామి. నేటి రాజకియం లో ప్రజలను చైతన్యం చేస్తున్న ఈ సాధారణ అర్చకుని వైపే అందరి చూపు,ఇప్పటికే అగ్ర నాయకులు సైతం చైతన్యస్వామి కోసం ఎదురు చూస్తున్నారంటే ఆయనకు పెళ్లెల్లో ఎంత పట్టు ఉందో తెలుసు కోవచ్చు.