కొండా సురేఖ బేషరతుగా కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి

దసరా పండుగకు బతు కమ్మ చీరలు ఏమైనాయి…

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండ సురేఖ బిఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పై విమర్శలు చేయడం సిగ్గుచేటు బతికే ఉన్నాడా అని అనడం ఎంతవరకు సమంజసం ఆత్మ విమర్శ చేసుకోవాలని రాజకీయ బిక్ష పెట్టిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నుండి 2014 లో ఎమ్మెల్యేగా గెలిపించింది కేసీఆర్ గుర్తు చేశారు లేకపోతే ఎప్పుడో రాజకీయ సన్యాసం తీసుకుని ఉండేదని ఎద్దేవా చేశారు హైడ్రా పై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై కేటీఆర్ పై సినిమా హీరోయి న్లపై విమర్శలు చేస్తూ పాలన పక్కకుపెట్టి కాలం వేల్లతీస్తున్న రని మండిపడ్డారు బతుకమ్మ పండుగ నాడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుక మ్మ చీరలు ఇస్తే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ముందు ప్రజలకు బతుకమ్మ చీరలు పంచాలని తెలిపారు రాజకీయంగా తొలిసారి శాయంపేట మండలం నుండి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి మండలానికి చేసింది ఏమీ లేదని ఉన్న నియోజకవర్గాన్ని కూడా భూపాలపల్లిలో కలిపిం దని మండిపడ్డారు.ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాలని కెసిఆర్, కేటీఆర్ పై విమర్శలు మానుకోవాలని డిమాండ్ చేశారు ఇంకోసారి ఇలాంటి విమర్శలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమా లు చేపడతామని హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ తెలంగాణ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ శాయంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గాజే రాజేందర్ మండల నాయకులు కుతాటి రమేష్ నమిత బాజీ అశోక్ మైలారం మాజీ సర్పంచ్ అరికిల్ల వీరయ్య యూత్ జిల్లా నాయకులు అరికిల్ల వెంకట్ నాయకులు దూదిపాల రాజిరెడ్డి ,మారపల్లి క్రాంతి (లడ్డు) తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version