చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ లు* విచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన మహానీయుడని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తొలి తరం ఉద్యమాన్ని ముందుండి నడిపించాడని తెలిపారు. క్విట్ ఇండియా గైర్ ముల్కీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పోరాట యోధుడు అని చెప్పారు.ఆయన చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు గుర్రం తిరుపతి, ఏకు కిషన్ కొర్రి అశోక్ తదితరులు పాల్గొన్నారు.