#నెక్కొండ, నేటి ధాత్రి:
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత పూజా కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నర్సంపేట మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. మూడో రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమేగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొమ్ము రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని దుర్గామాత దేవిని వేడుకున్నట్లు తెలిపారు.