క్రికెట్ పోటీలు ప్రారంభించిన కోడి అంతయ్య

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం గండి లచ్చ పేట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను స్థానిక వైస్ ఎంపీపీ జింగిటి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఇట్టి పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి తంగళ్ళపల్లి ఎంపిటిసి కోడి అంతయ్య క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి లచ్చపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గండి లచ్చపేట గ్రామంలో వైస్ ఎంపీపీ అంజయ్య ఆధ్వర్యంలో పోటీలు ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడలలో శారీరక మానసిక ఉల్లాసాని అలాగే ఆరోగ్యం కాపాడుకోవడం జరుగుతుందని ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తూ స్నేహపూరిత వాతావరణం లో క్రికెట్ ను ఆస్వాదించి క్రీడా స్ఫూర్తి చాటాలని క్రీడాకారులకు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి సిద్దన్న ఆత్మకూరి చంటి సాయిరాం రమేష్ శంకర్ జలంధర్ శ్రీశైలం కిషన్ శ్రీనివాస్ ప్రశాంత్ బాలయ్య మోహన్ అజయ్ బిక్షపతి గ్రామస్తులు ప్రజలందరూ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *