మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 14
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెండెల సమ్మయ్య, నరాల ఓదెలు కుటుంబ సభ్యులను చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ ఓదార్చి, ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మృతి చెందిన పెండెల సమ్మయ్య, నరాల ఓదెలు ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి జడ్పిటిసి జోరుక సదయ్య, పెంతల రాజేందర్ రెడ్డి, పిడిసిల్ల సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.