తెలంగాణ కోసం పోరుయాత్ర చేసిన వీరుడు కిషన్ రెడ్డి

ఉద్యమకారుల పై తుపాకీ ఎత్తిన నీకు కిషన్ రెడ్డిని విమర్శించే హక్కులేదు

కట్టగాని శ్రీకాంత్ గౌడ్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు

పరకాల నేటిధాత్రి
తొలి ప్రజా విజయోత్సవ సభ ఫెయిల్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు కాదని అపజయోత్సవాలు తెలంగాణ ద్రోహులు సోనియా రేవంత్ తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ రేవంత్ అని 1300మంది ఉద్యమ కారుల బలిదానం ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని తెలంగాణ సాధన కోసం పోరు యాత్ర మరియు నిరాహార దీక్ష చేసిండు కిషన్ రెడ్డి అని తెలంగాణ ఉద్యమ కారుల పైన తుపాకీ ఎత్తిన ఘనత రేవంత్ రెడ్డిదని బీజేవైఎం హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు కట్టగాని శ్రీకాంత్ గౌడ్ అన్నారు.అనంతరం మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రజా విజయోత్సవ సభ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా విజయోత్సవసభ అనే పేరుతో జరిగిన సమావేశంలో సమావేశం ఉద్దేశం లేకుండా మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజా విజయోత్సవ సభ అని పెట్టి ఏ విజయాలు పూర్తిస్థాయిలో నెరవేరిందని చెప్పకుండా ప్రజల దృష్టినిమరిచే విధంగా సంబందం లేకుండా కిషన్ రెడ్డిని విమర్శించడం సిగ్గు చేటని ప్రజలు గమనిస్తున్నారని మీ మాయల ఫకీరు మాటలు ఇంకా నుండి చెల్లవు జాగ్రత్త అని బీజేవైఎం జిల్లాఉపాధ్యక్షులు కట్టగాని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు.
ప్రాంతం వాడు మోసం చేస్తే పాతిపెట్టాలని కాళోజీ చెప్పినట్టు చేయాల్సి వస్తే అందరికంటే ముందు రేవంత్ రెడ్డినే చేయాలని అతి పెద్ద తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డినే అని,ఏనాడైనా జై తెలంగాణ అని నినదించినవా నువ్ చేసిన ఉద్యమాలేంటి చెప్పమని, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన బుడ్డర్ ఖాన్ నువ్వు తెలంగాణ గురించి మాట్లాడడమా అని తెలంగాణ సాధన కోసం పోరుయాత్ర చేసింది కిషన్ రెడ్డిఅని పార్లమెంటులో బిల్లు పాస్ కావాలని నిరాహార దీక్ష చేసింది కిషన్ రెడ్డినే అని కిషన్ రెడ్డి అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తే నువ్వు సమైక్యాంధ్ర కోసం సహకరించిన విషయం మరచిపోయావా అని,పూటకో పార్టీ మారిన చరిత్ర నీది ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం నీది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి చేరే పచ్చి అవకాశవాదివని నీతి నిజాయితీ,నైతిక విలువలకు పెద్దపీట వేసే కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని తెలంగాణ కోసం 1300 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే నువ్వే సోనియా గాంధీని బలిదేవత అని అన్నది మరిచావ అని 1300 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ చితి మంటలపై చలి కాచుకున్న పార్టీ కాంగ్రెస్ చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందే తప్ప తెలంగాణపై ప్రేమతో కాదని ఎప్పటికైనా కిషన్ రెడ్డి ని అన్నమాటలు వెన్నక్కి తీసుకోవాలని కట్టగాని శ్రీకాంత్ హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version