హన్మకొండ,నేటిధాత్రి:
త్వరలో జరగబోయే కేలో ఇండియా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో హనుమకొండ కు చెందిన సాయి ప్రణీత ఎంపిక అయినందుకు
హనుమకొండ జిల్లా డివైఎస్ఓ జి.అశోక్ సాయి ప్రణీత కు అభినందనలు తెలిపారు.ఇటీవల 21 నుండి 23 సౌత్ లాలాగూడ హైదరాబాదు స్టేడియంలో సబ్ జూనియర్ బాక్సింగ్ స్టేట్ మీట్ లొ
గోల్డ్ మెడల్ సాధించిన కందుకూరి సాయి ప్రణీత సిల్వర్ మెడల్ కొడకండ్ల హర్ష మెడల్స్ సాధించారని హనుమకొండ ఖేల్ ఇండియా బాక్సింగ్ కోచ్ దేవరకొండ ప్రభుదాస్ తెలిపారు.ఈనెల 18 నుండి 26 వరకు ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు సెలెక్ట్ అయిన సాయి ప్రణీత ను హన్మకొండ డివైఎస్ఓ జి.అశోక్ అభినందించారు. జాతీయస్థాయిలో మెడల్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు.