పేద ప్రజల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం.

#భూమి పూజ చేసి గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఎంపీపీ సునీత.

నల్లబెల్లి, నేటి ధాత్రి: రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు గూడు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 లక్షల రూపాయలతో గృహలక్ష్మి కార్యక్రమం చేపట్టి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఎంపీపీ ఉడుగులసునీత ప్రవీణ్ గౌడ్ అన్నారు మండలంలోని లెంకలపల్లి గ్రామంలో గృహ లక్ష్మీ లబ్ధిదారుడు భూమి పూజ కార్యక్రమం చేపట్టగా ముఖ్యఅతిథిగా ఎంపీపీ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేశారని మండలంలోని అర్హులైన పేదలు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తామని ఆమె అన్నారు కార్యక్రమంలో సర్పంచ్ మేకల లక్ష్మీ సాంబయ్య, మాజీ సర్పంచ్ గన్నెబోయిన చేరాలు గౌడ్, ఉప సర్పంచ్ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి గడ్డమీది సృజన రత్నాకర్, నాయకులు కొత్తపెళ్లి అశోక్, మామిండ్ల రాజు, ఆకుల సాంబారావ్, కస్తూరి రవి, బోయిని పోషాలు, గాదం కొమరయ్య, కోమండ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version