పరకాల నేటిధాత్రి
తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ రధసారధి, ఉద్యమ నాయకుడు,తెలంగాణ సాధకుడు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం రోజున కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా సేవ చేయాలని పరకాల పట్టణoలోని పలు వార్డులలోని ఆలయాలలో,చర్చి,మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి,పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం బి ఆర్ ఎస్ పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,సమన్వయ కమిటీ సభ్యులు,మహిళ కమిటీ నాయకురాళ్లు,సీనియర్ నాయకులు,వార్డు కమిటీ అధ్యక్షులు,అనుబంధ సంఘాల భాద్యులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
