గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన సర్పంచ్,
నిజాంపేట( మెదక్)నేటిధాత్రి.
స్వరాష్ట్రం సాధించాక తండాలను గుర్తించి ప్రజల సౌలభ్యం కోసం గ్రామ పంచాయితీలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని సర్పంచ్ అరుణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని జడ్చర్ తండ గ్రామంలో బుదవారం రోజున 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ అరుణ్ కుమార్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పెద్ద సంగ్యా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ముఖ్యంగా గిరిజనులను గుర్తించి తండాలను గ్రామపంచాయతీ చేయడమే గాక సీసి రోడ్లు, వైకుంఠ దామం, డంపింగ్ యార్డ్, మిషన్ భగీరథ లాంటి పనులు పూర్తి చేశామని, అలాగే పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్ధమని అన్నారు. తాండ అభివృద్ధికి కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు లక్కీ, జగన్, లక్ష్మీ, భి అర్ ఎస్ నాయకులు, మంగ్యా, గ్రామ పెద్దలు సంగ్యా, బాల్య తదితరులు పాల్గొన్నారు