`పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య ప్రణాళిక కరదీపిక.
`ప్రతి ఇల్లు నిండుగా.. పల్లెకు పండుగ.
`ఊరికోసం మన మందరం కదులుదాం.. ఊరుపేరు నిలబెడదాం.
`కట్టా రాకతో కదలిన కమలాపూర్!
`ఉత్సాహంగా సాగిన పారిశుధ్య పరిరక్షణ.
`మన ఊరు.. మన బాధ్యత ఒక వినూత్న యజ్ఞం.
`మన ఊరు.. మన బాధ్యత లో భాగంగా కట్టా శ్రమ దానం.
`సర్పంచ్ చేస్తున్న స్వచ్ఛ కమలాపూర్ కు కట్టా చేయూత.
`కన్నతల్లి, పుట్టిన ఊరు అన్నిటికన్నా గొప్పది.
`ఇల్లు ఎంత శుభ్రంగా వుంటుందో ఊరు కూడా అంతే సుందరంగా వుండాలి.
`ఊరు కోసం ఒక్క రోజు శ్రమ దానం ఎంతో ఆదర్శం.
`ప్రతి ఊరు కమలాపూర్ లా కదిలితే దేశమంతా సౌభాగ్యం.
`ప్రతి కుటుంబం ఆరోగ్యం.. ప్రతి ఊరు నందన వనం.
`ఆరోగ్యమే మహాభాగ్యము.. ఊరు స్వచ్ఛతే సుందర వనము.
`కట్టాతో కలిసి సాగిన శ్రమ దానం..స్వచ్ఛతకు శ్రీకారం.
`కమలాపూర్ లో కదిలిన యువత.. ఊరు భావితకు సరికొత్త బాట.
`ఈ యజ్ఞం ఆగకూడదు.. వారానికి ఒక్క సారి సాగినా ఊరికి జ్వరం కూడా రాదు.
` ఊరు చల్లగా వుంటే.. ఊరంతా పండగ చేసుకుంటుంది.
`ఊరు పచ్చగా వుంటే.. అందరికీ ఆరోగ్యం పంచుతుంది.
`ఊరు కళకళ లాడితే జీవితాలు కిలకిల రావాలవుతాయి.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఆ ఊరు కట్టా ఓసారి రావా అనిపిలించి. నీ ఊరికి ఏదైనా సేవ చేయవా? అని పిలిచింది. తాతల నాడు ఆ ఊరికి చేసిన సేవలు ఇంకా గుర్తున్నాయని గుర్తు చేసింది. కన్న తల్లి మీద ప్రేమ, పుట్టిన ఊరి మీద మమకారం బతికున్నంత కాలం ఎవరికీ పోదు. అందుకే కమలాపూర్‌కు కట్టా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబందం వుంది. ఆ కుటుంబం తాతల నాడు ఆ ఊరి చెరువును నిర్మాణం చేశారు. చెరువుకు ప్రాణం పోశారు. ఊరికి నీటి కష్టం రాకుండా పెద్ద ఎత్తున కట్ట నిర్మాణం చేశారు. తరతరాలకు ఊరికి కల్పతరువుగా మార్చారు. ఆ చెరువు ఆ ఊరికి ఆదెవరుగా మారింది. కొన్ని కుటుంబాలకు ఆ చెరువు ఆదారమైంది. ఆదాయం ఇస్తుంది. ఊరి సాగుకు నీటిని అందిస్తుంది. ఆ ఊరు కట్టా కుటుంబాన్ని ఇంకా గుర్తు పెట్టుకుంది. ఆనాటి ఆనవాలుతో కట్టా కుటుంబానికి ప్రత్యేక స్దానం ఏర్పడింది. అప్పటి నుంచి కట్టా కుటుంబం అంటే ఊరుతో మరింత మమకారం పెరిగింది. తరాలు గడిచినా, ఊరు వదలి ఆ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లినా, ఊరును వాళ్లు మర్చిపోలేదు. ఊరిలో వారికి ఆనవాలును వదులుకోలేదు. అందుకే సమయం చిక్కినప్ప్పుడల్లా ఊరును చూసి వస్తుంటారు. ఊరి బాగోగులు తెలుసుకుంటారు. ఊరి కోసం తమ శక్తికి మేరకు మేలు చేసి పెడుతుంటారు. ఆ పరంపర కొనసాగింపులో భాగంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, ఫోన్ చేసి కట్టా రాఘవేంద్రరావును ఓసారి ఊరికి రమన్నారు. మన ఊరు..మన భాద్యత పేరుతో నెలలో రెండు శనివారాలు స్వచ్ఛ కమలాపూర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దాంతో వెంటనే స్పందించిన నేటి ధాత్రి దినపత్రికి ఎడిటర్, ధాత్రి గ్రూప్స్ చైర్మ్‌న్ కట్టా రాఘవేంద్రరావు, ఆయన కుమారుడు నేటిదాత్రి డిజిటల్ డైరక్టర్‌తో కలిసి కమలా పూర్‌కు వస్తామని మాటిచ్చారు. అన్నట్లుగానే శనివారం కమలా పూర్ చేరుకున్నారు. ఊరంతా కట్టా రాఘవేంద్రరావును ఘనంగా స్వాగతం పలికింది. స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా కట్టా రాఘవేంద్ర రావు ఊరి ప్రజలనేద్ధేశించి మాట్లాడారు. ఊరితో తమకు వున్న అనుబందాన్ని గుర్తు చేశారు. ఊరి కోసం తమ తాతలు చేసి సేవలను కొనియాడారు. సామాజిక బాద్యత అనేది తమ తాతల కాలం నుంచి వస్తుందని చెప్పారు. ఊరికోసం ఆ కాలంలోనే ఎంతో చేసిన తమ కుటుంబం, ఇప్పటికీ ఏదైనా చేయాలన్న తపన ఎప్ప్పుడూ వుంటుందన్నారు. అందుకే సర్పంచ్ పబ్బు సతీష్ కోరికను అంగీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ కుటుంuం ఆ కాలంలోనే ఊరి కోసం ఎంతో చేసిందన్నారు. కమలాపూర్ అందమైన ప్రపంచం. అది ఎప్ప్పుడూ కళకళలాడాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఊరికోసం ఇక నుంచి మనందరం కదులుదాం..ఊరి పేరు నిలబెడదాం అని యువతకు సూచించారు. ఊరంతా పచ్చగా వుండాలి. పరిశుభ్రంగా వుండాలి. పచ్చదనం వెల్లివిరియాలి. పాడి పంటలతో ఊరు సౌభాగ్యంగా వెలుగొందాలని కట్టా రాఘవేంద్రరావు సూచించారు. ముఖ్యంగా యువత తమకు వున్న సమయంలో ఒక రోజు రెండు మÖడు గంటలు కేటాయిస్తే చాలు. ఊరంతా నందనవనంగా మారిపోతుందని అన్నారు. కమలాపూర్ తెలంగాణకే కాదు, దేశానికే ఆదర్శం కావాలని కోరారు. అందుకు ఊరి పెద్దలు, యువకులు తోడ్పాటునందించాలన్నారు. కేవలం కొంత సమయం ఊరి కోసం వెచ్చిస్తే చాలు అన్నారు. ఊరంతా తల్చుకుంటే కమలాపూర్ సుందరవనంగా వెలుగొండం పెద్ద సమస్య కాదు. అందరం శ్రమ దానం చేస్తే ఊరు సుందరమయం చేయడం పెద్ద సమస్య కాదు. అయితే అందరిలోనూ అంకితభావం వుండాలి. ప్రభుత్వమే అన్ని చేయాలని అనుకోకూడదు. దేశం మనకేమిచ్చిందని అనుకోవడం కన్నా, మనం దేశానికి ఏమిస్తున్నాన్నదే ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు. మన ఇల్లు ఎంతో శుభ్రంగా వుండాలని కోరుకుంటాం. రోజుకు రెండు సార్లైనా సరే శుభ్రం చేసుకుంటాం. అలాగే మన ఊరు కూడా శుభ్రంగా వుంటే మనం ఆరోగ్యంగా వుంటాం. ఈ రోజు నేను ఊరి ప్రజల్లో చూసిన ఉత్సాహం ఎప్ప్పుడూ మర్చిపోను. తనకు సాదర స్వాగతం పలకడంతోపాటు, మీతోపాటు కలసి ఊరికోసం శ్రమ దానం చేసే అవకాశం రావడం కూడా ఎంతో ఆనందాన్ని అందించింది. ఊరి కోసం చేసే చిన్న శ్రమ దానంలో ఇంత ఆత్మ సంతృప్తి వుందా? అని కూడా మనసు పులకరించింది. మన కోసం గ్రామం పారిశుద్య పనులు నిర్వహించే వాళ్లు ఎంత కష్టపడుతున్నారో ఒక్క పూటలో మనందరికీ అర్దమౌతోంది. నిత్యం వాళ్లు ఊరి కోసం పడుతున్న శ్రమలో ఒక్క పూట సహకరిస్తే వారిని మనం ఎంతో గౌరవించినట్లౌవుతుంది. వారి సేవలు ఎంతో గొప్పవి. అవి అందరం చేయలేం. నిజం చెప్పాలంటే పారిశుద్య పనులు అనేవి ఉపాది కాదు. ఊరికి వాళ్లు చేసే సేవకు నిదర్శనమని చెప్ప్పుకోవాలి. గ్రామ సర్పంచ్ సతీష్ తీసుకున్న ఇలాంటి వినూత్నమైన యజ్ఞం నిరంతరం కొనసాగాలి. అందుకు మాతోపాటు, ఊరంతా సహకరించాలి. ఊరంతా కదలాలి. అప్ప్పుడు ఊరు పాలవెళ్లిలా మెరిపోతుంది. ఆర్యోగానికి ఆర్యోగ్యం..ఆనందానికి ఆనందం మిగులుతుంది. మన ఊరు దేశానికి ఆదర్శమౌతుంది. కట్టా రాఘవేంద్రరావు కమలాపూర్ చేరుకోగానే గ్రామ ప్రజలు ఎంతో ఆదరంగా పలకరించారు. ఆయన స్వయంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తుంటే ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించారు. ఊరి మీద ఎంత ప్రేమ వుంటే ఇలా పాలు పంచుకోగలరు అని ప్రజలు అనుకున్నారు. కట్టా రాఘవేంద్రరావుతోపాటు, ఆయన కుమారుడు మలి తరం నుంచి కట్టా శివసుబ్రహ్మణ్యం కూడా అలుపు లేకుండా వీధులు శుభ్రం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా గమనించారు. సామాజిక సేవ అనేది వారి రక్తంలోనే వుందని అనుకున్నారు. మొత్తానికి ఊరు మెచ్చేలా, పిలిచినందుకు సంతోషించేలా సేవలను అందించి శబాష్ అనిపించుకున్నారు. ఇలాగే సమయం దొరికనప్ప్పుడు ఊరికి వచ్చి వెళ్లాలని కోరారు.
బాక్స్ ఐటమ్
ఇంటర్ ర్యాంకర్ కోరం వైష్ణవికి, కట్టా శివసుబ్రహ్మణ్యం రూ.5వేల ఆర్ధిక సాయం.
కమలాపూర్ గ్రామానికి చెందిన పేద విద్యార్ధిని కోరం వైష్ణవి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రంలోనే నెంబర్ టూ ర్యాంక్‌ను సంపాదించుకున్నది. పేద కుటుంబంలో వికసించిన చదువల సరస్వతి వైష్ణవి. ఆమె చదువకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనతో నేటిధాత్రి డిజిటల్ డైరెక్టర్ కట్టా శివసుబ్రహ్మణ్యం వైష్ణవికి రూ.5 నగదు ప్రోత్సాహం అందించారు. వైష్ణవి మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదన్నారు. చదువులో ఎంతో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులెందరికో కట్టా రాఘవేంద్రరావు ఆర్ధిక చేయÖతనందిస్తూ వుంటారు. అలా కమాలాపూర్‌లో పేదవిద్యార్ధి గురించి తెలిసి వెంటనే వైష్ణవికి ఆర్ధిక చేయÖతనందించారు. కట్టా కుటుంబం సామాజిక సేవకు గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు. పేదవిద్యార్ధికి సాయం చేయడాన్ని గ్రామస్ధులు అభినందించారు.
