సిరిసిల్ల (నేటి ధాత్రి):
హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా గత 15 రోజుల పాటు కుంగ్ ఫు మాస్టర్ ఒడ్నాల శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు ఈరోజు శనివారం సిరిసిల్ల లోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది.
ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పున్నంచందర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడినారు.
ఈ సందర్భంగా మహిళల ఆత్మరక్షణలో కర్ర సాము చాలా ఉపయోగపడుతుందని అన్నారు.ప్రతి మహిళ మరియు యువతులు కర్ర సాము నేర్చుకుందుకు ముందుకు రావాలని అన్నారు.
హెల్పింగ్ హార్ట్స్ ఉచిత కర్ర సాము శిక్షణ ఇవ్వడం అభినందనీయం అని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అంతటా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావాలని హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థను కోరారు.70 మంది బాలికలు, మహిళలు కర్ర సాములో శిక్షణ పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళలందరూ కర్ర సాము నేర్చుకోవాడని ముందుకు రావాలని కోరారు.
హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాపకులు కె. పున్నంచందర్ మాట్లాడుతు యువతుల్లో, మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యంగా కర్ర సాము శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
కుంగ్ ఫు మాస్టర్ ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ 150 మంది పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చి బెల్టులు, సర్టిఫికెట్ లు ప్రధానం చేసినట్లు వివరించినారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ కమటం అంజయ్య, హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు కనుకుంట్ల పున్నంచందర్, కుంగ్ ఫు మాస్టర్ వి.శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ చింతోజు భాస్కర్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు ఆలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి దాసరి తిరుమల, ఎ .వేణు, శ్రీనివాస్ పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.