#నెక్కొండ ,నేటి ధాత్రి:
నెక్కొండ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా అలంకాని పేట ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్ నూతనంగా ఎన్నికయ్యారు. గత సంవత్సరం కాలంలో నెక్కొండ వైస్ ఎంపీపీగా ఎన్నికైన రామారావు పుండరీకం గుండెపోటుతో మృతి చెందగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నెక్కొండ వైస్ ఎంపీపీ కి బుధవారం ఎన్నికలు జరగగా అలంకాని పేట ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్ ఎన్నికైనట్లు ఎన్నికల ఇంచార్జ్ తెలిపారు. అనంతరం నెక్కొండ వైస్ ఎంపీపీ ఎన్నికైన శ్రీనివాస్ ను బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సూరయ్య, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, ఎంపీపీ రమేష్ నాయకులు సాలువాతో సన్మానించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నెక్కొండ అంబేద్కర్ సెంటర్లో బాణాస పేలుస్తూ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి శివకుమార్, సూరం రాజిరెడ్డి, సారంగపాణి, మాదాసు రవి, వంశీకృష్ణ, బిఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.