బీసీ కుల వృత్తుల లలో ఇతర కుల మతాల జోక్యం సబబు కాదు..
కులవృత్తుల కాపాడేందుకు సామాజిక ఉద్యమానికి సిద్ధం..
తెలంగాణ బిసి రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ బీసీ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం మహబూబ్ నగర్ జిల్లా సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది.. అధ్యక్షుడు కుమ్మరి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్ర కమిటీ విస్థరణలో బాగంగా కందమూరి బ్రహ్మయ్య ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇట్టి కార్యక్రమానికి జిల్లా కార్యవర్గం తో పాటు వివిధ కుల సంఘాల ప్రముఖులు హాజరయ్యారు. బీసీ మహాసభ క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్లాలని కుల వృత్తులను కాపాడాలని చాకలి మంగలి విశ్వకర్మ ఆరెకటిక మేదరి ముదిరాజ్ వంటి ఎన్నో కులాలకు ఉన్న ప్రధానమైన కులవృత్తంలోకి ఇతర కులస్తులు/మతస్తులు ప్రవేశించి అనాదిగా వస్తున్న కులాలకు చెందిన వారి కులవృత్తులను కబళించడంద్వారా బీసీ కులస్తులు కులవృత్తికి దూరమై భీదరికంలోకి నెట్టబడడం చాలా దుర్మార్గమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు వెటకాడి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ ల సాధికారత కు అభివృద్ధికోసం బీసీ సామాజిక వర్గాల కుల వృత్తులను కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వం పై ఎంతైనా ఉందని బీసీ ల కులవృత్తుల లో ఇతర కుల మతాల జోక్యం సబబు కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.సామాజిక ఉద్యమం తప్పదని .
జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రామచంద్రయ్య కుల వృత్తులను కాపాడడానికి తెలంగాణ బీసీ మహసభ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
అనాదిగా వస్తున్న బీసీ కులవృత్తులను కాపాడి వారి సాధికారతకు అభివృద్ధికి పడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని రాష్ట్ర అధ్యక్షుడు మేట్టుకాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. త్వరలోనే కొలవృత్తుల్లోకి ప్రవేశించిన ఇతర వ్యక్తుల జోక్యాన్ని తగ్గించడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించడానికి బీసీ మహాసభ సిద్ధమవుతుందని అందుకోసం సమగ్ర ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నామని హామీ ఇచ్చారు. కులవత్తుల కాపాడటంలో బీసీ లలోని అన్ని కులస్తులు చేయి చేయి కలిపి సమిష్టిగా పోరాడి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కుల వృత్తులను కాపాడేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు గజగౌని కురుమయ్య గౌడ్ , సిద్ది రామప్ప, హరిప్రకాష్ గౌడ్, రాష్ట అర్గనైజింగ్ సెక్రటరీ ఉపాధ్యక్షులు మేదర ఆంజనేయులు, రాములు, మెట్టుకాడి శ్యాం, సుబ్రహ్మణ్యం, యాదగిరి, లక్ష్మయ్య, రజక విష్ణు, పిల్లి శ్రీహరి, దత్తు, రమేష్, గౌలి ఆనంద్, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.