కల్లుగీత కార్మిక సంఘం జిల్లాచైతన్య సభలను జయప్రదం చేయండి: చౌగాని సీతారాములు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా చైతన్య సభలను జయప్రదం చేయాలనితెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగానీ సీతారాములు* గీత కార్మికులకు పిలుపునిచ్చారు.

సోమవారం స్థానిక వృత్తిదారుల కార్యాలయం నల్లగొండలో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ కల్లగీత కార్మిక సంఘం జిల్లా స్థాయి చైతన్య సభలను ఫిబ్రవరి 28వ తారీఖున నల్లగొండలోని యుటిఎఫ్ భవనంలో నిర్వహిస్తున్నామని ఈ చైతన్య సభలకు జిల్లాలోని కల్లుగీత పారిశ్రామిక సహకార సంస్థల అధ్యక్షులు టిఎఫ్టి బాధ్యులు కల్లుగీతా కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు హాజరుకావాలని పిలుపునిచ్చారు ఈ చైతన్య సభలలో కళ్ళు గీత కార్మిక పారిశ్రామిక సంఘాల విశిష్టత మరియు జీవోలు మనకు ఉన్న హక్కులు తదితర విషయాలపై అదేవిధంగా కల్లుగీతా కార్మికుల సమస్యలపై కేడర్ను సంసిద్ధత చేయుటకు చైతన్య సభలను జరుపుతున్నామని ఈ చైతన్య సభలకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు పామన గుండ్ల అచ్చాలు, సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version