కళ్లుండీ చూడలేని కబోది కేటీఆర్ టీపీసీసీ అధికార ప్రతినిధి “బండి సుధాకర్ గౌడ్”

తెలంగాణలో  పిరాయింపులకు పితామహుడే కేసీఆర్!
తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి “సోనియమ్మ” కు మోసం చేసి రాహుల్ గాంధీ కి లేక ఎలా రాశారో సమాధానం చెప్పండి!
మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోపెట్టిన మీ “దొర అహంకారం” ఇంకా తగ్గట్లేదు “కేటీఆర్” సీఎం “రేవంత్ రెడ్డి” పై నోరు జారితే “ఖబర్దార్ కేటీఆర్”.!
“నేటిధాత్రి” హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ఏడాది పాలనలో విజయవంతంగా ముందుకెళుతుంటే.. ఓర్వలేకనే  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాహుల్ గాంధీ గారికి లేఖ రాశాడని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు.   కళ్లుండీ చూడలేని కబోది కేటీఆర్ అని ఆయన దుయ్యబట్టారు. 
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి రూ.2500 పథకం తప్ప మిగతా 5 గ్యారెంటీలు అమలు కావడం లేదని కేటీఆర్, రాహుల్ గాంధీకి లేఖ ఎలా రాస్తారని సుధాకర్ గౌడ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేటీఆర్ నిరూపించగలరా, ఉచిత బస్సు ప్రయాణంలో 80 కోట్ల మంది మహిళలు లబ్ది పొందలేదని నిరూపించగలవా , ఉచిత విద్యుత్తు కింద 50 లక్షల మంది గృహిణులు లబ్ది పొందలేని నిరూపించగలవా? కేటీఆర్.. అని ఆయన సవాల్ విసిరారు.
అదేవిధంగా 26 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ జరగలేదని చెప్పే దమ్ముందా?  రైతు భరోసా కింద రూ.7600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయలేదని చెప్పగలవా కేటీఆర్ అని బండి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం 14000 కోట్లు ఖర్చు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి 26,800 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయినా, అబద్దాలతో అందరినీ తప్పుదేవ పట్టించడం కేటీఆర్ దొరహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర సంక్షేమం మరిచి, రాద్దాంతం చేస్తున్న కేసీఆర్ ఖబడ్దార్ అని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. 
అసెంబ్లీలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి కేటీఆర్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో ఫిరాయింపులకు పితామహుడే కేసీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ అవహేళనగా మాట్లాడటాన్ని బండి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ భాష మార్చుకపోతే న్యాయపరంగా  సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!