జూటాకోర్ కాంగ్రెస్ ను అడుగడుగునా నీలాదీయండి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కి ఈసారి వారే గుణపాఠం చెప్తారు అన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం లోని నవబుపేట మండల కేంద్రం లో ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లి వరకు ఏ అభివృద్ధి పనులైన మోడీ నిధులతోనే జరిగిందన్న ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓట్ల కోసం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదని ఆమె… ప్రజలంతా మరోసారి నమ్మితే మోసపోతారని సూచించారు. ఇక భూస్థాయి నుంచి కార్యకర్తలు అంతా కలిసికట్టుగా పనిచేసి బిజెపి అభ్యర్థి అరుణమ్మ గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సొంతగూటికి చేరిన నవబుపేట్ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు

కొంతకాలంగా బిజెపి పార్టీకి దూరం ఉంటూ పాలరమెంటు ఎన్నికల్లో భాగంగా డీకే అరుణమును గెలిపించడానికి మాజీ నవాబుపేట బిజెపి అధ్యక్షులు నర్సిపూర్ గ్రామానికి చెందిన బాలస్వామి డీకే అరుణమ్మ సమీక్షంలోపార్టీలో చేరారు.

అరుణమ్మ కామెంట్స్

కాంగ్రెస్ ఆరు హామీలపై డీకే.అరుణమ్మ సెటైర్లు

ఇచ్చిన హామీలు అమలు చేయనోళ్ళకు ఓట్లడిగే హక్కు లేదు

అరు గ్యారంటీలు అంతా ఉత్త ముచ్చటే..

– రైతులకు రైతు బంధు ఇచ్చారా..?

– మహిళలకు 2500 ఇచ్చారా..?

– నిరుద్యోగులకు భృతి ఇచ్చారా..?

– ఇచ్చిన హామీలలో ఏం అమలు చేసారని మీకు ఓటేయ్యాలి..?

జూటాకోర్ కాంగ్రెస్ ను అడుగడుగునా నీలాదీయండి

కాంగ్రెస్ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ.. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కస్టపడి పని చేయండి

హామీలు అమలు చేయలేక కాంగ్రెసు తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది

అందుకే అప్పులున్నాయి, నిధులు లేవు అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది

ఢిల్లీ టూ గల్లీ వరకు నిధులు మావే..
గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్లు ముకుమ్మడిగా మద్దతు తెలపాలి

గ్రామా పంచాయతీలకి డైరెక్ట్ గా నిధులు ఇచ్చింది మొదీ ప్రభుత్వమే

గ్రామాల్లో జరిగిన ప్రతి అభివృద్ది పనికి నిధులు‌ ఇచ్చింది మోదీనే

ఈ దేశ ఆర్థిక స్తీతిగతులను మార్చి ప్రపంచ దేశాల్లొ ఐదవ స్థానంలలోకి తీసుకెళ్లిన ఘనత మోడీనే

మోదీ… ది లెజెండ్ లీడర్
ప్రపంచం మెచ్చిన నాయకుడు మన దేశ ప్రధాన మంత్రిగా ఉండాలా..? చెతగాని దద్ధమ్మలకు అవాకాశం‌‌ ఇద్దామా.?

2047 కల్లా మన భారత దేశాన్ని అర్థికంగా ముందుంచేందుకు వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్నారు

అందుకే‌ ఇవాళ ప్రజలందరూ మొదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు

పార్లమెంట్ ఎన్నికలపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలి

ఇది పెద్ద ఓటు.. ఈ దేశానికి ప్రధాని ఎవరో నిర్ణయించే ఓటు

మంచి చేసిన మోదీని నిలబెట్టుకుందాం.. పాలమూరు సీటును గిఫ్ట్ గా ఇద్దాం

ప్రతి ఇంటిమీద శ్రీరాముని పేరు రాయబడిందంటే.. దేశంలో రామ రాజ్య స్థాపన ప్రారంభమైంది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version