వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పు కరీమాబాద్ నకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, వరంగల్ తూర్పు ఎలక్ట్రానిక్ మీడియాలో గత 12 ఏండ్లుగా పనిచేస్తున్న నీలం శివ (దామోదర్) ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. నీలం శివతో పాటు జనసేన పార్టీ తూర్పు కన్వీనర్ బాలు గౌడ్ కూడా బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ నుండి నీలం శివ మీడియా ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ వరంగల్ తూర్పులో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని నరేందర్ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.