టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు హర్షం.
జర్నలిస్ట్ ఎండి. ఖాజాపాషాను సన్మానించిన ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నిజాలను నిర్భయంగా రాస్తూ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న డైనమిక్ జర్నలిస్ట్ ఎండి. ఖాజాపాషా (కేపి) అని టీయూడబ్ల్యూజే (143) జర్నలిస్టు సంఘం రాష్ట్ర శాఖలో కార్యనిర్వహక కార్యదర్శిగా ఎంపిక చేయడం హర్షనీయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు.
మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ కేపీని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల కాలం నుండి ఎన్నో సంచలనాత్మక కథనాలతో ప్రజలకు జర్నలిస్ట్ కేపీ ఎంతో సుపరిచితమని కొనియాడారు. ప్రజలకు ఉపయోగకరమైన వార్తలను అత్యంత శీఘ్రంగా అందిస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా తన ఉన్నతిని చాటుకున్నాడని ఎమ్మెల్యే అన్నారు. గతంలో తాను కూడా జర్నలిస్టుగా అతని వెంట పత్రికలో పనిచేసిన అనుభవం ఉందని, ఖాజా పాషాను చాలా దగ్గర నుండి చూసిన అనుభవం ఉందని ఎమ్మేల్యే పేర్కొన్నారు.
వాస్తవాలను ప్రతిబింబించడంలో ఖాజా పాషాది అందెవేసిన చెయ్యి అని అన్నారు. రాష్ట్రస్థాయిలో కార్యనిర్వాహక కార్యదర్శి బాధ్యతలు తీసుకోవడం మంచి విషయమని ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు కూడా ఉంటుందని అన్నారు. మొదటి నుండి జర్నలిస్టు ఖాజాపాషా ఎన్నో పోరాటాలు నిర్వహించారని జర్నలిస్టుల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా వారి వెంట ఉన్నారని పేర్కొన్నారు.
జర్నలిస్టు వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని గత పది ఏళ్లలో విపరీతమైన కేసులు చుట్టుముట్టిన నిర్భయంగా వాటిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఎవరిని కష్టాలకు గురిచేసిన చివరకు న్యాయం గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, కలం వీరులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. వాస్తవాలను ఎల్లప్పుడూ ప్రతిబింబించాలని పేర్కొన్నారు. విషయ పరిజ్ఞానంతో వచ్చే వార్తలకు విలువ ఎక్కువగా ఉంటుందని అలాంటి వార్తలను ఇవ్వడంలో ఖాజాపాషా ముందుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, ఎంపిటిసి కృష్ణ, చెన్నయ్య, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.