బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలం మంగలవారిపేట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన ఖానాపూర్, మండలం, మంగలవారిపేట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.పార్టీలో చేరిన వారి వివరాలు చెన్నబోయిన లింగయ్య,యాదవ సంఘం కుల పెద్దమనిషి బత్తుల శ్రీను, బుర్క సారయ్య కన్నెబొయిన రాజశేఖర్,పిల్లల కుమారస్వామి,నిరటి సారయ్య,వల్లమాల గణేష్ వర్మ లతో పాటు తదితరులు చేరడం జరిగింది.నూతనంగా చేరిన వారికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఒడిసిఎంస్ చైర్మన్ రామ స్వామి నాయక్ , స్థానిక సర్పంచ్ రమేష్ , సర్పంచ్ సుమన్ సదర్లాల్ క్లస్టర్ భాద్యులు, సొసైటీ డైరెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.