మేదర సంఘం జిల్లా అధ్యక్షులు మధిర రవీందర్
జమ్మికుంట: నేటి ధాత్రి
వెదురు దినోత్సవ వేడుకలకు అధిక సంఖ్యలో తరలిరావాలని కరీంనగర్ జిల్లా మేదర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మదిర రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మధిర రవి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18 న జరుగు ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకలు కరీంనగర్ జిల్లాలోని గీత భవన్ చౌరస్తా నుండి ప్రారంభమై కలెక్టర్ కార్యాలయం వరకు కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ వినతి పత్రము ఇవ్వడం జరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రతి మండలము, గ్రామము నుండి అధిక సంఖ్యలో పాల్గొని ప్రపంచ వెదురు దినోత్సవం విజయవంతం చేయగలరని రవి కోరారు . ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వలిపిరెడ్డి లచ్చయ్య , సహాయ కార్యదర్శి సిలువేరు సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ కుల రాజనర్సు, కరీంనగర్ పట్టణ అధ్యక్షులు ఏకుల రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వాసం సర్వేశం ,కొత్తపెళ్లి మండల అధ్యక్షులు మధిర గంగాధర్, పట్టణ గౌరవ అధ్యక్షులు పిట్టల కనకయ్య, రేపాల వీరస్వామి ,ప్రభాకర్ బాలయ్య, వెంకన్నరసు తదితరులు పాల్గొన్నారు.