కాంగ్రెస్ జిల్లా నాయకుడు సాయిలి ప్రభాకర్
వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
హైదరాబాద్ తుక్కుగూడలో కనివిని ఎరుగని లక్షలాదిమందితో జరిగే జన
జాతర సభను వరంగల్ జిల్లా అలాగే పరకాల నియోజకవర్గం నుంచి ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు యువజన, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్ కోరారు.ఈ జన జాతర సభకు ఏఐసీసీ నాయకులు టీపీసీసీ నాయకులు పాల్గొని పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, ఎన్నికలకు దిశ నిర్దేశం చేసి ఎన్నికల్లో అవలంబించే విషయాలు చెప్పనున్నారన్నారు.
# జిల్లా అధికార ప్రతినిధిని కలిసిన సాయిలి ప్రభాకర్..
పరకాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాడ కొమురా రెడ్డిని పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ప్రభాకర్ వెంట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు. స్వామి, మండల నాయకులు జన్నారపు నాగరాజు ఉన్నారు.