జైపూర్,నేటి ధాత్రి:
శుక్రవారం రోజున న్యూఢిల్లీలో జరిగిన ౩వ జాతీయ పవర్ జెనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ అవార్డు అందుకుంది.సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యల్పముగా నీటిని వినియోగించినందుకు గాను ”బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డ్”లభించింది.న్యూఢిల్లీ లో కౌన్సిల్ అఫ్ ఎన్విరో ఎక్సలెన్సు వారి ఆధ్వర్యంలో ఈ అవార్డ్ ను సింగరేణి విద్యుత్ కేంద్రం అధికారి డి.పంతులు,డిజిఎం(ఈ&ఎం)అందుకున్నారు.జాతీయ స్థాయిలో 500 మెగావాట్లు ఆ పైన సామర్థ్యం గల సుమారు 150 ప్రభుత్వ,ప్రైవేటు విద్యుత్ కేంద్రాల్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ అవార్డు లభించింది.బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డ్ రావడం పట్ల సింగరేణి సి& ఎండి ఎన్.బలరాం మరియు డైరెక్టర్(ఈ&ఎం)డి.సత్యనారాయణ రావు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకి ఈ అవార్డు రావడం పట్ల ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్)ఎన్.వి.రాజశేఖర్ రావు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా ఈడి మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక గంట సమయంలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి గరిష్టంగా మూడు ఘనపు మీటర్ల నీటిని వినియోగించడానికి ఒక ప్రామాణికంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ(సిఈఆర్ సి)వాళ్ళు సూచిస్తారని సాధారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఈ ప్రమాణాన్ని దాటే నీటి వినియోగం ఉంటుందని,సింగరేణి విద్యుత్ కేంద్రంలో 2.5 ఘనపు మీటర్ల నీటిని మాత్రమే వినియోగించి ఒక గంట సమయంలో ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.అదేవిధంగా మన సంస్థ సి& ఎండి.ఎన్. బలరాం ట్రీ మాన్ అఫ్ తెలంగాణ మరియు స్వయానా ప్రకృతి ప్రేమికులు,వారి దిశా నిర్దేశంలో అతి తక్కువ నీటిని వినియోగించడం కోసం సింగరేణి ధర్మం విద్యుత్ కేవలం వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది హైడ్రోబిన్ సిస్టం వినియోగించడం వల్ల నీటి వినియోగం చక్కగా ఉంటుందని,జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థలను కూడా నిర్వహించడం వలన ప్లాంట్ లో వివిధ విభాగాల నుంచి బయటకు విడుదలవుతున్న అపరిశుభ్రమైన నీటిని సైతం పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే ఫ్లైయాష్ కూడా ఎప్పటికప్పుడు బయటకు రవాణా చేయడం జరుగుతుందని దీనివల్ల కూడా నీటిని పొదుపు చేయడం జరుగుతున్నదని అన్నారు.విద్యుత్ కేంద్రంలో తీసుకుంటున్న పర్యావరణహిత చర్యలకు ఇప్పటికే పలు జాతీయ స్థాయి అవార్డులు లభించాయన్నారూ.