రామడుగు, నేటిధాత్రి:
అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని జాతీయ యువజన అవార్డు గ్రహీత, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అలువాల విష్ణు అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి పంచమ విశంతి వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 27న జరుపు కళ్యాణం కొరకు గోపాలరావుపేట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీల ఆడపడుచు అయినా శ్రీపద్మావతి దేవికి పట్టు వస్త్రాలు, సారే, ఓడిబియ్యం అమ్మవార్లకు, స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా హరికి అత్తింటివారమూ సిరికి పుట్టింటి వారమూ అనే సనాతన ధర్మాన్ని పాటిస్తూ స్వామివారికి పట్టువస్త్రాలను ఆలయ ప్రధాన అర్చకులు డింగిరి సత్యనారాయణచార్యులుకి అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కొలిపాక మల్లయ్య, పద్మశాలి సంఘం నాయకులు సిరపురం సత్యనారాయణ, మోర బద్రేశం, కొలిపాక మల్లేశం, మచ్చ లచ్చయ్య, కొలిపాక నాగరాజు, రుద్ర నాగరాజు, స్వర్గం లక్ష్మీనారాయణ, అలువాల సుధాకర్, భూర్ల రాంచంద్రం, గాజుల కేశవులు, కొలిపాక రాములు, కొలిపాక పురుషోత్తం, సిరిపురం మధుసూదన్, ఐట్ల మల్లేశం, గోనె రమేష్, సిరిపురం నారాయణ, మచ్చ మనోహర్, కొలిపాక శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, ప్రవీణ్, పురుషోత్తం, చంద్రయ్య, నారాయణ, నల్ల అంజయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ నార్ల రమేష్, సభ్యులు దొనపాటి సీతారాంరెడ్డి, కాసారపు బుచ్చి రాములు, మల్లేశం, రామస్వామి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.