# ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ ప్రకటన విడుదల.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారామెడికల్ కోర్సులకు గాను అడ్మిషన్ పొందడానికి దరఖాస్తులకు ఈ నెల 30 వరకు
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నర్సంపేట యందు స్వీకరించనున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారం డిఈసిజి, డి డయాలసిస్ వివిధ కోర్సులు కోసం అభ్యర్థులు దరఖాస్తు తో పాటు అన్ని సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ స్వీయ
ధ్రువీకరణతో జతపర్చగలరని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో అందజేయాలని తెలియజేశారు.దరఖాస్తులలో తప్పుడు సమాచారం, సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించని యెడల తిరస్కరించబడుతుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.దరఖాస్తు ఫారం అలాగే పూర్తి వివరాలకు tgpmb.telangana.gov.in లో చూడగలరని ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు.
