జ్యోతిషవాస్తు బ్రహ్మ శ్రవణ్ శాస్త్రికి దక్కిన అవకాశం
#నెక్కొండ, నేటి ధాత్రి:
ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ ఐవిఎఫ్ఎ ఆధ్వర్యంలో ఈనెల 23న న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేద జ్యోతిష సమ్మేళనానికి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన జ్యోతిషవాస్తు బ్రహ్మ బూరుగుపల్లి శ్రావణ్ శాస్త్రికి ఆహ్వానం అందింది. ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ యుఎస్, ఇండియా చార్టర్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు అవకాశం దక్కింది. న్యూఢిల్లీ లోని ప్రఖ్యాత ఇంటర్నేషనల్ హోటల్ రాడిసన్ బ్లూ లో నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశ, విదేశాల నుండి వేద జ్యోతిష పండితులు హాజరవుతున్నారు. ఆధునిక సమాజంలో ప్రజలకు ఎదురవుతున్న సవాళ్ల కు జ్యోతిష శాస్త్రం తమ పరిధిలో నూతన పరిష్కారాలు కనుగొనే దిశగా చర్చలు సాగనన్నాయి. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో 2006- 08లో ఎంఏ జ్యోతిష్య శాస్త్రం అభ్యసించిన శ్రవణ్ శాస్త్రి అప్పటినుండి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ గా సేవలందిస్తున్నారు..వివాహ సమయం- జ్యోతిష ప్రభావం అనే అంశంపై పరిశోధనాత్మక వ్యాసాన్ని సమర్పించారు. జాతక సమస్యలు -జ్యోతిష్య పరిష్కారాలు (ఆస్ట్రాలజికల్ రెమెడీస్) అనే అంశంపై తర్ఫీదు పొందుతున్నారు. నెక్కొండ మండలం అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ (శ్రవన్ శాస్త్రి) కి తెలంగాణ ప్రాంతం నుంచి ఢిల్లీ సదస్సుకు హాజరవుతున్న నలుగురిలో తనకు ఒక్కరిగా అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ అరుదైన అవకాశం కల్పించడంలో సహకరించిన నిర్వాహకులకు శనివారం శ్రవణ్ పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలో ఈనెల 21 ,22వ తేదీలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తమ బృందం పాల్గొననున్నట్లు తెలిపారు.