సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది.
పాఠశాల ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్
మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అట్టహాసంగా ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్ ముందుగా మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులతో కేక్ కట్ చేయించి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు, పోటీలలో గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర గొప్పదని ఒకప్పుడు సమాజ కట్టుబాట్ల వల్ల ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన మహిళలు నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ ఎర్ర సంపత్, సి బ్యాచ్ రవి, ప్రైమరీ ఇంచార్జి సునీత, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లులు తదితరులు పాల్గొన్నారు