నవోదయ హైస్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

2024 ప్రచార థీమ్ “ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్ డైరెక్టర్ మామిడి అనురాధ

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో నవోదయ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి.వివిధ రంగాలలో మహిళలు చేసిన కృషి మరియు విజయాలను గుర్తించి, అభినందించేందుకు ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు.స్త్రీ దేవుని యొక్క అత్యంత శక్తివంతమైన మరియు అందమైన సృష్టి. మన ఉనికి వెనుక ఒక స్త్రీ ఉంది. కానీ మన సమాజాలలో ఉంది. ఎక్కడో ఒకచోట, స్త్రీలను ఇంకా తక్కువ అంచనా వేస్తారు మరియు పురుషుల కంటే బలహీనంగా ఉన్నారని నమ్ముతారు.స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి అంటే చల్లనిదీ ఆహ్లాదకరమైనది అందులో మొదటి స్థానం అమ్మ అమ్మ ప్రేమ సృష్టిలో కనిపెట్టలేనిది వెలకట్టలేనిదీ అమృతము కంటే తీయనైనదీ జాబిలి కంటే చల్లనిదీ, వెన్నకంటే మెత్తనిదీ మనసును గెలవ గలిగినదీ అమ్మ ప్రేమ ఒక్కటే,అమ్మ చేతి స్పర్శ ఓదార్పు అమ్మ కోపంలో ప్రేమ అమ్మ మీద గౌరవం. మరో ముఖ్యమైన స్త్రీ భార్య
ఆకాశాన సూర్యుడు లేకపోతే జగతికి వెలుగుండదు ఇంట్లో భార్య లేకపోతే ఆ ఇంటికి వెలుగుండదు భర్త వంశానికి మూలకర్త భార్య ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది అత్త మామలను ఆడపడు చులను చూసుకుంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకొనేది భార్య,భర్త గౌరవాన్ని కాపాడుతూ,జీవితాంతం భర్త సేవలు చేస్తూ జీవితంలో పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి జీవితాన్ని పంచే మన మనిషి
భార్య ఆమెకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేం.ఆమెను మనసు కష్ట పెట్టకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవడం తప్ప అదే ఆమెకు మనమిచ్చే విలువైన ఆభరణం. అందుకే అన్నారు ఇంటికి దీపం ఇల్లాలు అని, స్త్రీ ఒక సోదరిగా అన్నదమ్ముల శ్రేయస్సును కోరుతూ అత్తవారింట్లో కూడా సోదరుల ఆదరాభిమాాల గురించి ముచ్చటిస్తూ మురిసిపోతుంది. స్త్రీ ఒక బిడ్డగా ఎక్కడ ఉన్నా తల్లి తండ్రుల బాగోగుల గురించి ఆలోచిస్తూవారి ప్రేమను గురించితలచుకుంటూ తన బిడ్డలకు కూడా తల్లి తండ్రుల గురించి గొప్పగా చెప్పుకుంటుంది అమ్మగా ఆప్యాయత సోదరిగా అనురాగం భార్యగా బాధ్యతలు బిడ్డగా ప్రేమాభిమానాలు పంచుతూ బహుపాత్రాభినయంతో అందరినీ ఆకట్టుకొని ఓర్పు గల మహాసాధ్విగా పేరొందిన ఘనత మహిళలది. సర్వే జనా సుఖినోభవంతు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సౌమ్య, సంధ్య, జయ, మౌనిక, మాధవి, సుమలత, స్వాతి, ప్రసూన, శివ, సందీప్, రాజేందర్, వెంకట్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version