ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని హృదయ స్పందన హోప్ సేవా సొసైటీ ఎన్జీవో ఆధ్వర్యంలో అధ్యక్షులు పెండెం శివానంద్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వైస్ చైర్మన్ కాకర్ల అనితారెడ్డితోపాటు కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్ పాల్గొని విభిన్న రంగాల్లో సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనిత రెడ్డి మాట్లాడుతూ మహిళలకు చట్టాల పట్ల అవగాహన అవసరమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని పేర్కొన్నారు. హృదయ స్పందన హోప్సేవ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సన్మానించడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకురాలు పెండెం రాజేశ్వరి, కల్లేపల్లి సుజాత సురేష్, శానబోయిన రాజ్ కుమార్, అడ్వకేట్ జ్యోతి, కూడా అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ సుమలత, ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు, చిలువేరు రజిని భారతి, చైర్మన్ గుంటి రజిని, కౌన్సిలర్ పెండం లక్ష్మి, దార్ల రమాదేవి, నల్ల భారతి, గుర్రెపు అరుణతోపాటు నర్సంపేట డివిజన్లోని పలువురు మహిళలు పాల్గొన్నారు.