#తెలుగు అక్షరాలకు పూజలు నిర్వహించిన చిన్నారులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం విద్యార్థులు బుధవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాలనీలో విద్యార్థులు పలకపై తెలుగు అక్షరాలను రాసి అక్షరాలకు పూజలు నిర్వహించి మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు మాట్లాడుతూ. అన్ని భాషల్లో అందరికీ ప్రావీణ్యం ఉండడంతోపాటు మాతృభాషపై మరచిపోనంత మక్కువ ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్య నేర్పిన గురువులు తమకు నేర్పించాలని గుర్తు చేశారు.అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితోపాటు మండల ప్రజలకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల, సహస్ర అన్విక కర్ణిక. సాన్విక .నిహాన్ .హిమాన్స్. మివాన్. హర్షిత .అలేఖ్య. తదితరులు పాల్గొన్నారు..
