జిల్లా ఉద్యాన శాఖ అధికారి. డి సంజీవరావు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ స్థలాన్ని శనివారం రోజున పరిశీలించడం జరిగిందని జిల్లా ఉద్యాన శాఖ అభివృద్ధి అధికారి డి సంజీవరావు, తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైన్ పాక గ్రామంలోని సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని , అలాగే ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో రోడ్డు నిర్మాణం నీటి వసతి కోసం ఐదు బోరు బావులను ఏర్పాటు చేయడం జరిగిందని, కరెంటు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో గల పిచ్చి మొక్కలను బండ రాళ్లను తీసి నేలను చదును చేయడం జరిగిందని, ఫ్యాక్టరీ కోసం కావలసిన సదుపాయాలు ఏర్పాట్లు తదితరుల పనులు జరుగుతున్నాయని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఫ్యాక్టరీ నిర్మాణం త్వరలో పూర్తి కావస్తున్నందున ఆసక్తి గల రైతు సోదరులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని ఉద్యాన శాఖ మరియు సువేన్ ఆగ్రో ఇండస్ట్రీస్ వారు రైతులను కోరడం జరిగింది, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వలన జిల్లాలోని ప్రజలకు రైతు సోదరులకు మరియు నిరుద్యోగులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధిపరమైన అవకాశాలు నెలకొల్పబడతాయని అన్నారు, ఈ కార్యక్రమంలో సువేనో ఆయిల్ ఫామ్ నిర్మాణ ఇన్చార్జి గవాస్కర్, మండల ఆయిల్ ఫామ్ ఉద్యోగి అరవింద్, ఉద్యానశాఖ అధికారి భూపాలపల్లి డివిజన్ ఎడ్ల సునీల్, తదితరులు పాల్గొన్నారు.