జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామపంచాయతీలో బుధవారం రోజున ఎం ఓ ఆర్ డి నుండి వచ్చిన నేషనల్ లెవెల్ మానిటర్ సభ్యులు కేహెచ్.సునీల్ మరియు సివి.బాలమురళి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా టేకుమట్ల గ్రామపంచాయతీలో పర్యటించి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను ఎస్ హెచ్ జి గ్రూపు మహిళల కోసం చేపట్టిన చర్యలు గ్రామపంచాయతీ ప్రొఫైల్స్,క్యాష్ బుక్స్, ఆసరా పెన్షన్లు,జనాభా లెక్కలు,కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు,జిపిడిపీ ప్రణాళిక తయారీ విధానం,మిషన్ భగీరథ నీటి సదుపాయాలు,పారిశుద్ధ్య కార్యక్రమాలు,మిషన్ అంత్యోదయ గ్యాప్స్,ఇతర శాఖలతో సమన్వయం కలిగి ఉండుట,వాత్సల్య పథకం అమలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించడం జరిగింది.అనంతరం అధికారులతో,గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై,సమస్యలపై వివరణలు అడిగి తెలుసుకున్నారు.చేయవలసిన పనుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంబంధిత అధికారులకు సూచించారు.