ప్రజా సంక్షేమ వేదిక రాష్ట్ర నాయకులు శనిగరపు శ్రీనివాస్
పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి అని ప్రజా సంక్షేమ వేదిక రాష్ట్ర నాయకులు శనిగరపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం పరకాల లోనిప్రభుత్వ గురుకుల పాఠశాలలో కమిటీ ఆద్వర్యం లో సర్వే నిర్వహించారు.రాష్ట్రం లోని అనేక ప్రభత్వ గురుకుల పాఠశాల లకు స్వంత భవనాలు లేక అద్దె భవనాలలో అంటూ సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతున్నాయి అని, విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు,మంచి నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.చాలా గురుకుల పాఠశాలల్లో సరిపడ ఉపాధ్యాయులు లేరన్నారు.ప్రభుత్వం చిత్తుద్ధితో వెంటనే నిధులు మంజూరు చేసి గురుకుల పాఠశాలలకి స్వంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.