గుండాల ఎస్ఐ రాజశేఖర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల అభివృద్ధికి అడ్డుకట్ట వేసే మావోయిస్టులను నిర్మూలిద్దం అంటూ మావోయిస్టు లను గుర్తించే వారి ఫోటోలను గుండాల, సాయన్నపల్లి ,చిన్న వెంకటాపురం ,అడవిరామవరం ,దామరతోగు గ్రామాలలో ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందిని వెంటబెట్టుకుని ప్రజలందరూ చూసి గుర్తించే ప్రదేశాలలో మావోయిస్టు ఫోటోలను అతికించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రాజశేఖర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఫోటోలోని ముద్రించిన వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే వెంటనే ఫోటోలో సూచించిన క్రింద ఉన్న ఫోన్ నెంబర్లకు వెంటనే సమాచారం అందించాలని ఎవరైనా అనుమానాస్పదంగా అపరిచిత వ్యక్తులు ఏదేని ప్రదేశంలో కనిపించినట్లయితే ఆలస్యం చేయకుండా గుండాల పోలీస్ స్టేషన్ నెంబర్లకు సమాచారం తెలపాలని సూచించారు. అసాంఘిక శక్తుల వలన అభివృద్ధికి ఆటంకమే గాని ప్రయోజనం లేదని, ప్రజలు ఇట్టి విషయాన్ని తెలుసుకుని అభివృద్ధికి సహకరించాలని ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కిన్నెర రాజశేఖర్ తో పాటు కానిస్టేబుల్ రాంబాబు మరియు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.