ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని ఎంఈఓ ఆఫీస్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు శనివారం నిరవధిక సమ్మె చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెంచిన వేతనాలను పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాల్గవ రోజు సమ్మెను కొనసాగించారు మధ్యాహ్న భోజన కార్మికులకు సర్కులర్ నంబర్,8/2023ను వెంటనే అమలు చేసి పెంచిన బకాయి వేతనాలను చెల్లించాలని వంట కార్మికులకు రావలసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు కేరళ ప్రభుత్వం రోజుకు 600 రూపాయలు చెల్లిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం కూడా చెల్లించాలని 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో నలుగురు వంట మనుషులను నియమించి పని చేసే పద్ధతిలో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు అదేవిధంగా 9 10 వ తరగతి విద్యార్థుల మెస్ బిల్లులను చెల్లించి పెరుగుతున్న వస్తువుల ధరలకు అనుకూలంగా కోడిగుడ్లు గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరల కనుగుణంగా మేస్ చార్జీలు పెంచాలి ప్రభుత్వం వంట సామాగ్రి మరియు నిత్యావసర వస్తువులను సరాపర చేస్తామని హామీ ఇచ్చి నేటికీ పంపిణీ చేయనందున వంట చేయలేకపోతున్నాం అన్నారు వంట కార్మికుల అక్రమ తొలగింపులను నివారించాలన్నారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్ సుల్తాన్ బాద్ మండల అధ్యక్షురాలు తోడేటి లావణ్య జంగం లక్ష్మి నూనెటి రాధమ్మ భాగ్యలక్ష్మి సిహెచ్ పద్మ ఓదెల రమేష్ తదితరులు పాల్గొన్నారు