మంత్రి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

వి.బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ 2023-2024 పోస్టరును రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. బుధవారం బంజారాహిల్స్ లోని మంత్రి నివాసం లో పోస్టరును ఆవిష్కరించి నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీని ఇన్ఫ్రా ఎండి శ్రీను, సినీ నటుడు రచ్చరవి, వి.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎం.డి విష్ణు బొప్పన పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఈ అవార్డుల ప్రధానోత్సవానికి తాను ముఖ్య అతిథిగా వస్తానని మంత్రి తెలిపారు. సుమారు 80 మంది నటీనటులకు, టెక్నీషియన్లకు అవార్డులు ప్రధానం చెయ్యటం, పేద కళాకారులకు ఆర్థిక సహాయం చెయ్యడం పట్ల విష్ణు బొప్పనని మంత్రి అభినందించారు. సినీ, టివి రంగానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version