నడికూడ,నేటి ధాత్రి :మండల కేంద్రంలో రుద్రమాదేవి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,ఏపీఎం రమాదేవి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2203,కామన్ గ్రేడ్ రూ.2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో జమ వేస్తుందని పేర్కొన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి కుమారస్వామి,వివో అధ్యక్షురాలు తాళ్ల పెళ్లి స్రవంతి,ముత్యం లక్ష్మి, రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.