నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘo ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఎం రమాదేవి అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొదటి రకం వరి ధాన్యానికి రూ.2203, రెండవ రకానికి రూ. 2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ జ్యోతి, సి సి రాజు, వివో మహేశ్వరి సంఘం పెండ్లి భారతి, శోభారాణి, హరిత రైతులు తదితరులు పాల్గొన్నారు.