* వెయ్యి మంది షేర్ హోల్డర్లతో కోటి రూపాయల మూలధనంతో సంస్థ మొదలు
* ఈరోజు మూడు కోట్ల రూపాయలతో రైస్ మిల్లు నిర్మాణం
హుజురాబాద్: నేటి ధాత్రి
హుజురాబాద్ నియోజకవర్గం కందుగుల గ్రామ లో కందుగుల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి హుస్సేన్ మాట్లాడుతూ నా యొక్క మిత్రుడైన కే రాజమౌళి గారు నేను సింగరేణి సంస్థలో పనిచేసే రిటైర్డ్ అయి ఒక ఆలోచన విధానంతో ఏదో ఒక మంచి పని చేయాలని ఆలోచనతో 2018 వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించి ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఈ యొక్క సంస్థలో వెయ్యి మంది ఫేర్ హోల్డర్స్ తో మొత్తము కోటి రూపాయల మూలధనంతో ఈ యొక్క సంస్థను మొట్టమొదట ప్రారంభించాం అందులో భాగంగా ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ సేల్స్ షాప్ మరొకటి ఉప్పల్లో షాపు ఓపెనింగ్ చేసి మూడు సంవత్సరాలు సేల్స్ షాపు నడిపించిన తర్వాత కొంత లాభాలతో మూడు సంవత్సరాల క్రితం మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి నాబార్డ్ సంస్థ ప్రోత్బలంతో SBI బ్యాంక్ అధికారుల ప్రోత్బలంతో ఈ రైస్ మిల్లు నిర్మాణానికి ముందుకు వచ్చినం అందులో భాగంగా ఒక కోటి 50 లక్షల రూపాయలతో షెడ్డు నిర్మాణం చేసి ఒక కోటి 50 లక్షల రూపాయలతో మిషనరీతో ఈరోజు మూడు కోట్ల రూపాయలతో ఈ యొక్క రైస్ మిల్లు ప్రారంభించడం జరిగింది ఇట్టి సంస్థకు సీఈఓ గా సమ్మె రెడ్డి గారు పనిచేస్తున్నారు. అలాగే 8 మంది డైరెక్టర్లను తీసుకొని ఈ ముందుకు సాగినం ఈరోజు ఉత్పత్తి ప్రారంభించాం ఈ కార్యక్రమంలో సీఈవో సమ్మిరెడ్డి డైరెక్టర్లు సదానందం నక్క లింగయ్య రవీందర్ రెడ్డి రమేషు సుమలత శివారెడ్డి రాజేందర్ రెడ్డి ఎన్జీవో రాజమౌళి గారు ఎండి రషీద్ అలాగే సేల్స్ ఆఫీసర్ సతీష్ నాబార్డ్ సంస్థ అధికారులు ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ అలాగే 1000 మంది షేర్ హోల్డర్స్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు