మండల కేంద్రంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం

గంగారం/కొత్తగూడ. నేటిధాత్రి :

ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క.. ఆదేశాల మేరకు అభివృద్ధి పనిలో భాగంగా స్థానిక కొత్తగూడా గ్రామపంచాయతీ పరిధిలో 90 లక్షల రూపాయల గల 5 సీ, సీ రోడ్లను ప్రారంభోత్సవం చేసిన కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి కుంజ కుసమాంజలి సూర్య ఆమె మాట్లాడుతూ… నియోజకవర్గంలో ఎక్కువగా కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాలు అభివృద్ధి లో వెనుకబడిన మండలాలు అందుకే మంత్రి సీతక్క ప్రత్యేకంగా చొరవ చూపి ఉమ్మడి మండలాలకు అభివృద్ధి పనిలో భాగంగా సిసి రోడ్ల నిర్మాణ పనులకు.. ఎక్కువగా నిధులు ఇచ్చారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు రోడ్డు పనులలో నాణ్యత లోపం ఉండరాదని ఇవి మన రోడ్లు మన గ్రామాల రోడ్లు మనం ఉపయోగించుకునే రోడ్లు మన అందరిది అన్నారు మండలంలోని మొండ్రాయి గూడెం గ్రామపంచాయతీ పరిధి మోకాలపల్లిలో 40 లక్షల విలువగల 8 సీసీ రోడ్ల పనులను ప్రారంభోత్సవం చేసిన కుంజ కుసుమాంజలి సూర్య, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలంలో అన్ని గ్రామాలకు సీసీ రోడ్డు మరమ్మతులు నిధులు సాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు
కొత్తగూడ, మోకాళ్ళపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లావణ్య వెంకన్న, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, మల్లెల రణధీర్, ఇర్ప రాజేశ్వర్, హలవత్ సాలుకి సురేష్ ఎంపిటిసి కొత్తగూడ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి పసుల ఘట్టయ్య, బంగారి భారతి కిషన్ గ్రామ దొర పటేల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version