ఆకట్టుకుంటున్న సంపూర్ణ చిరుతల రామాయణ నాటక ప్రదర్శన

ఎండపల్లి నేటిధాత్రి

సంపూర్ణ రామాయణ నాటక ప్రదర్శన పలువురిని అశేషంగా ఆకట్టుకుంటుంది,జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో గురువారం నుండి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో,ప్రదర్శించబడుతున్న శ్రీ శ్రీ శ్రీ సంపూర్ణ చిరుతల రామాయణ నాటక ప్రదర్శన గ్రామ ప్రజల తో పాటు చుట్టూ గ్రామాల ప్రేక్షకులను నాటక ప్రదర్శన అలరింప చేస్తుంది. ఈ సంపూర్ణ నాటక ప్రదర్శన వెల్గటూర్ మండల మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, కొత్తపేట గ్రామ వాస్తవ్యుడు డా. మల్లెత్తుల సత్యం ల సౌజన్యంతో నిర్వహించబడుతున్న చిరుతల రామాయణం నాటక ప్రదర్శన,పలువురు చూపరులనుఅలరింపజేస్తుంది. ఈ రామాయణ నాటక ప్రదర్శన బోధకుడు గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మరవేని రాజేశం ఆధ్వర్యంలోప్రదర్శింపబడుతున్న చిరుతల రామాయణంలో మెన్నేని సాగర్ రావు( దశరథుడు ), సిపెళ్లి శంకరాచారి ( రాముడు), వడ్కాపురం లక్ష్మణ చారి( సీత), నడిగోట్టు తిరుపతి( శత్రుఘ్నుడు ), గోనె గంగారెడ్డి ( రావణబ్రహ్మ), తుర్క చంద్రారెడ్డి ( ఆంజనేయుడు ) వేషధారణలతో నాటక ప్రదర్శన రక్తి కట్టిస్తున్నారు. ఈనెల 19 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version