డి వై ఎఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్
పరకాల నేటిధాత్రి
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశగా ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు నిరాశకు గురయ్యాం కావున నా ఉద్యమాలు గుర్తించి మా పార్టీ సిపిఎం నాకు ఒక అవకాశం ఇస్తే పరకాల నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని మంద సురేష్ అన్నారు.మూడు సంవత్సరాలు పరకాల డివిజన్ అధ్యక్షుడిగా,ఆరు సంవత్సరాలు వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షునిగా,సంవత్సరం అనుమకొండ జిల్లా అధ్యక్షునిగా,ఇప్పుడు ప్రజెంట్ జిల్లా సహాయ కార్యదర్శిగా బాధ్యతలు గా ఉండడం జరిగింది.12 సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్న నాకు పార్టీ కార్యక్రమాలకు డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో అనేకమైన సమస్యల పైన ఉద్యమాలు చేయడం జరిగిందని అన్నారు.కావున పరకాల నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నా పైన నమ్మకం ఉంచి నన్ను గెలిపిస్తారని అందుకే టికెట్ తనకు కేటాయించాలని అన్నారు.