ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే అశోక్
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో
పార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరయ్య
వామపక్ష కార్మిక సంఘాల ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన
చేర్యాల నేటిధాత్రి…
కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్ మావో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య లు అన్నారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ నుండి సినిమా థియేటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను సవరించారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బ్యాంకింగ్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, విమానయానం, మైనింగ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేసి ఈ దేశ సంపదను కొల్లగొట్టారని విమర్శించారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కోడులను వెంటనే రద్దుచేసి, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దుచేసి సమాన పనికి సమాన వేతనం, ప్రతి కార్మికునికి నెలకు 26వేల వేతనాన్ని ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సదుపాయాలు కల్పించాలన్నారు. ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ. 800 ఇచ్చి పనులు జరిగే స్థలం వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దుచేసి విత్తనాలు ఎరువులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక వర్గం ఆధ్వర్యంలో బీజేపీ ని గద్దె దించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఈరి భూమయ్య, బద్దీపడగ కృష్ణా రెడ్డి, జంగిలి యాదగిరి, ఇప్పకాయల శోభ, కత్తుల భాస్కర్ రెడ్డి, పొన్నబోయిన మమత, రాళ్లబండి నాగరాజు, బండకింది అరుణ్ కుమార్, ఆముదాల రంజిత్ రెడ్డి, కర్రె ఆంజనేయులు, గొర్రె శ్రీనివాస్, నంగి కనకయ్య, ఆముదాల నర్సిరెడ్డి, వెలుగల యాదగిరి, మల్కని ఎల్లయ్య, ముస్త్యాల ప్రభాకర్, బక్కెళ్ళి బాలకిషన్, రేపాక కుమార్, బోయిని మల్లేశం, గూడెపు సుదర్శన్, దండబోయిన వెంకటేష్, రాళ్లబండి చందు, శిగుళ్ల నరేష్, దర్శనం రమేష్ చక్రపాణి, పండుగ యాదగిరి, చాప లక్ష్మీ, రంగు రమేష్, బ్రహ్మయ్య, బొడిగం చంద్ర రెడ్డి, గుండ్ర రవి, ఏఐటీయూసీ, సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.