లక్ష్మణ్ అన్నను భారీ మెజారిటీతో గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా

*ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం లక్ష్మీ నరసింహా రావు కోసం కాదు కేసీఆర్ కోసం

*కేసీఆర్ అంటేనే భరోసా, భవిష్యత్

*ఈ ఎన్నికలు ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కాదు, రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి

*ఢిల్లీ దొరలకు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి

*తెలంగాణ భవిష్యత్ ఢిల్లీలో కాదు తెలంగాణ గల్లీలో ఉండాలి

*కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి

*సెంటిమెంట్లు, అయింట్మెంట్లకు లొంగకండి

*సేవ చేసే వ్యక్తిగా ముందుకు వస్తున్న లక్ష్మణ్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించండి

– వేములవాడ పట్టణంలో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు..

*కేటీఆర్ అంటే సామాన్య వ్యక్తి కాదు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్: ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును భారీ మెజారిటీతో గెలిపిస్తే, వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం వేములవాడ పట్టణంలో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్యనో, లక్ష్మీ నరసింహా రావు కొరకో జరుగుతున్న ఎన్నికలు కావు, ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ కొరకు జరుగుతున్న ఎన్నికలు, రెండు పార్టీల మధ్యన జరుగుతున్న ఎన్నికలు, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు, ఢిల్లీ దొరల తెలంగాణ కావాలో, 4.5కోట్ల ప్రజల తెలంగాణ కావాలో ఆలోచించండి అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదు, ఎంతో మంది ఉద్యమకారులు బలిదానాలు చేసుకొని, త్యాగాలు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించింది తప్పితే, తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్నీ గుర్తుంచుకోండి అని అన్నారు. తెలంగాణ భవిష్యత్ కు భరోసా కల్పించే నాయకుడు సీఎం కేసీఆర్, అలాంటి నాయకుడు గెలిస్తేనే భవిష్యత్ తెలంగాణ గల్లీలలో ఉంటుంది, లేదంటే ఢిల్లీ దొరలకు గులాం అనాల్సిందే. లక్ష్మీ నరసింహా రావు అన్ని విధాలుగా బాగుండి, సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నాడు తప్పితే, గుడిని, గుడిలో శివలింగాన్ని మింగాలని రావడం లేదు, లక్ష్మణ్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించండి, వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాను, గెలిచిన వెంటనే నేను కూడా వేములవాడకు ఎమ్మెల్యేగా పని చేస్తాను అని హామీ ఇచ్చారు.

*తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్: ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ

తమ యువ నాయకుడు కేటీఆర్ కేవలం వ్యక్తి కాదు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. యువకుల భవిష్యత్ బాగుండాలని, ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చి ఈనాడు ఐటికి కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను మార్చిన ఘనత కేటీఆర్ కు దక్కుతుంది. కేటీఆర్ వంటి నాయకుడు మా దగ్గర లేడని చాలా దేశాల ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ లో 11మంది ముఖ్యమంత్రులు అనుకుంటూ, కుర్చీ కొరకు కోట్లాడుకుంటున్నారు. కానీ మాకు ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్. యువకులు గర్జించే సమయం అసన్నమైంది.ఒక్కసారి ఆలోచించండి.మోసపోయి గోసపడొద్దు. ప్రపంచాన్ని మార్చే శక్తి యువతలో ఉంది..ఇప్పటికే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 1.60లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. 88వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.వచ్చే 5ఏండ్లలో ఎవరు ఊహించని రీతిలో వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మార్క్ పేడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకులు మందాల భాస్కర్, దరువు ఎల్లన్న, జెడ్పి చైర్మన్ అరుణ- రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాధవి- రాజు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వీర్లపల్లి రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,ఆయా మండలాల యువజన విద్యార్థి విభాగ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటు సుమారు 2000 మంది విద్యార్థులు యువకులు, ఇతర గ్రామాల ప్రజలు, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version